Monday, May 13, 2024

హైదరాబాద్‎లో రూ. 1000 కోట్ల విలువైన భూమి కాజేసిన కాంగ్రెస్ లీడర్

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తల ఆగడాలు పెరిగిపోయాయి. అధికారులు, పోలీసులు, ప్రజలు.. ఇలా ఎవరినైనా సరే బెదిరిస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అయితే తమ ఇష్టారాజ్యానికి వ్యవహరిస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నాయకుల భూభాగోతం బయటపడింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములును గోపన్‎పల్లి కాంగ్రెస్ లీడర్ సురేందర్ కాజేశారు. సురేందర్ పేరు మీద 7 వేల గజాలు, సురేందర్ భార్య పేరు మీద 7 వేల గజాలు, సురేందర్ తమ్ముడి పేరుతో, బినామీల పేరుతో దాదాపు 7 ఎకరాలు కాజేసినట్లు తేలుస్తోంది. ఈ భూములన్నీ నానక్ రాంగూడ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములే కావడం గమనార్హం.

Read also: మున్సిపల్ చైర్మన్‏ను చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్

శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ సర్వే నెంబర్ 149లో గల ప్రభుత్వ భూమిని జీవో నెంబర్ 59ను అడ్డుపెట్టుకుని అక్రమంగా కాజేశారు. ఈ కబ్జా బాగోతంపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పోరేటర్ గంగాధర్ రెడ్డిలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉన్నతాధికారులు.. ఎమ్మెల్యే గాంధీతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కోట్లు విలువ చేసే భూమిని అక్రమంగా జీవో నెంబర్ 59 కింద శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదంతా ఎలక్షన్ ఫలితాలు వచ్చిన రెండు రోజులకే జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Latest News

More Articles