Sunday, April 28, 2024

కోటి రూపాయల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్న రాచకొండ పోలీసులు

spot_img

రాజస్థాన్ నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నామని తెలిపారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.

SOT, మీర్ పేట్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు సీపీ సుధీర్ బాబు. వీరంతా రాజస్థాన్ కి చెందిన వారన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపారు. మొదట డ్రగ్స్ కి బానిసై.. ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్స్ గా మారారు. రాజస్థాన్ లో హెరాయిన్ 5 వేలకు గ్రామ్, MDMA 4 వేలకు గ్రామ్ కొని.. హైదరాబాద్ లో 12 వేలకు గ్రామ్ వరకు అమ్ముతున్నారు. రాజస్థాన్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్ లో డ్రగ్స్ హైదరాబాద్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత రాపిడో బైక్ సర్వీస్ ద్వారా కష్టమర్స్ కి డ్రగ్స్ పంపుతున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి ఎక్కువగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. డ్రగ్ పెడలర్స్ ఆస్తులు కూడా సీజ్ చేస్తాం. డ్రగ్ వినియోగదారులను కూడా గుర్తిస్తాం.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు సీపీ సుధీర్ బాబు.

ఇది కూడా చదవండి: జనవరి 22న మద్యం, మాంసం దుకాణాలు బంద్..!

Latest News

More Articles