Friday, May 17, 2024

మల్కాజ్‌గిరిలో మర్రికి మద్దతుగా రంగంలోకి ఎన్నారైలు

spot_img

హైదరాబాద్: మల్కాజ్‌గిరి నియోజకవర్గం నేరెడ్‌మెట్ కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే (లండన్) శాఖ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ను విమర్శించే స్థాయి మైనంపల్లి హన్మంతరావుకు లేదని, ఇంకోసారి ఆయనపై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్‌ అని హెచ్చరించాడు.

ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పునర్జన్మ ఇచ్చి మల్కాజ్ గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాడని, కానీ ఆయనకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఖరారు చేసినా తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వనందుకు ఆయన పార్టీ మారేడే తప్ప పార్టీ ఆయనకు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదని, కానీ ఆయన పార్టీ నుండి బయటకు వచ్చి నోటికొచ్చినట్లుగా మాట్లాడం సరికాదన్నారు.

బీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ వెంట ప్రజలంతా నడువాలని బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎన్ఆర్ఐ అమెరికా కార్యవర్గ సభ్యులు జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లండన్ శాఖ నాయకులు గొట్టెముక్కల సతీష్ రెడ్డి, సుసికేష్, సుభాష్, ప్రవీణ్ పంతులు, రామ్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Latest News

More Articles