Saturday, May 4, 2024

డీకే శివకుమార్ కు సీబీఐ మరోసారి నోటీసులు!!

spot_img

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానెల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఢిల్లీలో తమ ముందు జనవరి 11న విచారణకు హాజరవ్వాలని అధికారులు సూచించారు. ఆ ఛానెల్లో పెట్టుబడులు, వాటా వివరాలు తెలియజేయాలని నోటీసుల్లో కోరారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్లో రూ.8 కోట్ల పైచిలుకు నగదు దొరికన వ్యవహారంలో శివకుమార్ ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆయనకు 2013-18 మధ్యలో ఉన్న సంపాదనలో రూ.74 కోట్ల లెక్కకు మించి ఆదాయం ఉందని 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. తనకు జైహింద్ ఛానెల్లో వాటా ఉందని 2017-18 మధ్యలో దాఖలు చేసిన పత్రాలు, ఆస్తి వివరాలతో శివకుమార్ ప్రకటించారు. కాగా, తాను ఆ ఛానెల్లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే స్పష్టం చేవారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఒత్తిడికి తీసుకువచ్చేందుకు ఇలా దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్రం వేధిస్తోందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నేఒక కప్పు బ్లాక్ టీ తాగుతే గుండెపోటుతోపాటు ఈ వ్యాధులన్నీ పరార్!!

Latest News

More Articles