Monday, May 13, 2024

జమ్ము కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తాం

spot_img

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ(బుధవారం) జమ్ము కశ్మీర్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. జమ్ము కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ఎన్నికల నిర్వహణపై జమ్ము కశ్మీర్ లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరిగిందని తెలిపారు రాజీవ్ కుమార్. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, వివక్ష లేకుండా నిజాయతీగా ఎన్నికలు జరపాలని వివిధ పార్టీలు కోరాయన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కూడా కశ్మీర్ రాజకీయ పక్షాలు కోరాయని చెప్పారు.అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండాలని కూడా పార్టీలు సూచించాయని చెప్పారు. వలసదారులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరాయని సీఈసీ వివరించారు.

85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి దగ్గర ఓటు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాజీవ్ కుమార్. ఎన్నికల్లో పాల్గొనాలని జమ్ము కశ్మీర్ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఇక, ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ సరైన సమయంలో విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌ పై దాడి

Latest News

More Articles