Sunday, May 19, 2024

తెలంగాణకు రూ.5,071 కోట్లు.. ఏపీకి రూ.9,138 కోట్లు.. ఎందుకీ వివక్ష?

spot_img

కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో రైల్వేల కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. వర్చువల్ విలేఖరుల సమావేశంలో మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో 10 శాతం నిధులు పెంచామన్నారు. 2009 నుంచి 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి రూ.886 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు రాష్ట్రంలో ఏటా 240 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు వేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలు కూడా 98 శాతం విద్యుదీకరణ పూర్తి చేశాయి.విశాఖ రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా భూమిని కేటాయించలేదని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఇక తెలంగాణలో రైల్వేలకు కేంద్రం రూ.5,071 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2009-2014లో ఏడాదికి 70 కిలోమీటర్లు మాత్రమే ట్రాక్‌ వేయగా, ఏటా 142 కిలోమీటర్ల మేర ట్రాక్‌ వేస్తున్నట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో 414 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, రోడ్డు అండర్‌ బ్రిడ్జిలు నిర్మించారు. రాష్ట్రంలో రైల్వేలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో రైల్వేలు 100 శాతం విద్యుదీకరణను పూర్తి చేశామన్నారు.

గతేడాది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇక తెలంగాణ పై మోడీ చూపిస్తున్న వివక్ష పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ వాటర్ బోర్డు, విభజన హామీలు, నిధుల విడుదల, ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్..ఇలా ఎలా చూసుకున్నా తెలంగాణపై వివక్ష చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర రాష్ట్రాలపైనే మోడీ ప్రేమని చూపిస్తుండటం మంచిది కాదని తెలంగాణ నుండి విమర్శలు వస్తున్నాయి.

Latest News

More Articles