Tuesday, May 21, 2024

తమిళనాడులో నిర్మలమ్మకు షాక్.. అయోధ్య లైవ్ LED స్క్రీన్‌ లు తొలగింపు

spot_img

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకని దేశమంతా తిలకించింది. టీవిల్లో బాలరాముడిని చూసి కోట్లాది భారతీయులు భావోద్వేగం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తమిళనాడులోని కామాక్షి అమ్మన్ ఆలయం నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని చేద్దామనుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి షాక్ ఇచ్చింది DMK ప్రభుత్వం. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం కోసం ఆలయంలో LED స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తుండగా.. తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని సీతారామన్ ఆరోపించారు. అప్పటికే ఏర్పాటు చేసిన కొన్ని LED స్క్రీన్‌లను కామాక్షి అమ్మన్ ఆలయ ప్రాంగణం నుండి తొలగించారు.

ఈ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను తమిళనాడు పోలీసులు తొలగించారని భారతీయ జనతా పార్టీ సైతం ఆరోపించింది. కాంచీపురం ఆలయంలో జరిగిన ఈ సంఘటనని బిజెపి తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జి సూర్య X లో పోస్ట్ చేసారు.“ప్రస్తుతం తమిళనాడు పోలీసులు ప్రాంగణంలోకి ప్రవేశించి LED స్క్రీన్‌లను తొలగిస్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్‌ ఇదేం జోక్‌” అని పోస్ట్ చేశాడు. జనవరి 22న అయోధ్యలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్‌లల్లా ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మలా సీతారామన్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే ప్రభుత్వ చర్యను “హిందూ వ్యతిరేకం”గా పేర్కొన్నారు.

 

Latest News

More Articles