Friday, May 17, 2024

దీప్తి హత్యకేసును  చేధించిన పోలీసులు..చెల్లే హంతకురాలు

spot_img

సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన టెక్కీ దీప్తి హత్య కేసు కొలిక్కి వచ్చింది. మూడు రోజుల్లో కేసును చేధించారు పోలీసులు. నిందితులను ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ భాస్కర్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

చెల్లి చందన ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా చెప్పారు. చందన డబ్బులు, బంగారం తీసుకొని తన బాయ్ ఫ్రెండ్‌ ఉమర్ షేక్ సుల్తాన్ తో కలిసి పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో దీప్తి అడ్డుకుంది. ఈ సమయంలో దీప్తి అరవకుండా నోటికి,ముక్కును తన చున్నీతో కట్టేసింది. అయినా అరుస్తుండంతో.. నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టారు కొంత టైం తర్వాత ఎలాంటి చలనం లేకపోవడంతో ప్లాస్టర్, చున్నీ తీసేసి..లిక్కర్ తాగి చనిపోయినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించినట్లు చందన అంగీకరించినట్లుగా తెలిపారు. చెల్లె చందన ఏ1 నిందితురాలు..ఏ2 చందన ప్రియుడు ఉమర్ పై కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి బాయ్ ఫ్రెండ్ ఉమర్,ఆయన తల్లి, మరో బంధువు, కారు డ్రైవర్ తో కలిసి చందనే హత్యకు పాల్పడట్టు ప్రాథమిక విచారణ తెలిపిందన్నారు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న చందన..తన సీనియర్ అయిన ఉమర్ ప్రేమించుకున్నారు. మతాతంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని సమయంలో ఉమర్ ను ఇంటికి వచ్చి..ఇంట్లో ఉన్న డబ్బులు, నగలతో తనను తీస్కెళ్లాలని చెప్పింది. ప్లాన్ ప్రకారం అక్కకు లిక్కర్ తాగించి..ఉమర్ తో పారిపోవాలని అనుకుంది. డబ్బులు,నగలతో పారిపోతుండగా…అప్పుడే మేలుక వచ్చిన దీప్తి అరవడంతో ..ఆమె నోరు, ముక్కుకు చున్నీ,ప్లాస్టర్ అతికించారు.దీంతో శ్వాస ఆడకపోవడంతో దీప్తి చనిపోయినట్లు తెలిపారు ఎస్పీ భాస్కర్‌.

చందన పారిపోతూ ఇంట్లో నుండి దాదాపు లక్షా 20 వేల రూపాయలు,70 తులాల బంగారం తీసుకెళ్లినట్టు గుర్తించామన్నారు. బంగారం,డబ్బు రికవరితో పాటు, చందన సహా మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Latest News

More Articles