Monday, May 13, 2024

తెలంగాణను మెచ్చుకుంటున్న ‘చాట్‌జీపీటీ’

spot_img

గడిచిన 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై కృత్రిమ మేధ (ఏఐ) టూల్‌ ‘చాట్‌ జీపీటీ’ కూడా ప్రశంసలు కురిపించింది. ‘వయసులో తొమ్మిదేండ్ల పసిబిడ్డ.. అభివృద్ధిలో మాత్రం పులిబిడ్డ’.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ నినాదం.. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతికి నిదర్శనం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘చాట్‌జీపీటీ’తో ప్రశ్నోత్తరాలు..

ప్రశ్న: గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందా?
చాట్‌జీపీటీ: గడిచిన 9 ఏండ్లలో తెలంగాణలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. 2014 జూన్‌ 2న ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలు, అభివృద్ధి పనులతో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విద్య-వైద్యం, పరిశ్రమలు వంటి కీలక రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొన్నాయి. కేసీఆర్‌ 9 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన కొన్ని ప్రధాన విజయాలు.. రైతుబంధు, డబుల్‌ బెడ్‌రూవ్‌ు ఇండ్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కళ్యాణలక్షి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, టీఎస్‌ఐఐసీ, టీఎస్‌ఆర్‌ఈడీసీవో, టీఎస్‌ఐపాస్‌, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు మొదలైనవి. ఇవే కాదు ఇంకెన్నో రంగాల్లో తెలంగాణ పురోగతి సాధించింది.

సాగు ప్రాజెక్టులు: వ్యవసాయానికి, తాగడానికి నిరంతరం నీరు అందేలా తెలంగాణ సర్కారు ఎన్నో ప్రాజెక్టులకు, పథకాలకు అంకురార్పణ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది.

పారిశ్రామికాభివృద్ధి: టీఎస్‌-ఐపాస్‌తో కొత్త పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఎన్నో ఎమ్మెన్సీలు తమ శాఖలను ప్రారంభించాయి. దీంతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు దక్కాయి. ఆర్థిక పురోగతికి మార్గం సుగమమైంది.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను మార్చేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేక చొరవ తీసుకొన్నది. టీ-హబ్‌ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది.

విద్య-వైద్యం: సామాజిక సంక్షేమానికి మూలాధారమైన విద్య, వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నది. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, ప్రభుత్వ దవాఖానల్లో వసతులను మెరుగుపర్చింది.

మిషన్‌ భగీరథ: ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన మిషన్‌ భగీరథ స్కీమ్‌ ఓ అద్బుతం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది.
గ్రామీణాభివృద్ధి: గ్రామజ్యోతి తదితర కార్యక్రమాలతో తెలంగాణ పల్లెలు అభివృద్ధిబాటలో పయనిస్తున్నాయి.

ప్రశ్న: తెలంగాణ మాడల్‌ దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా మారుస్తుందని భావిస్తున్నారా?
చాట్‌జీపీటీ: అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రం సాధించిన విజయాలు ఇతర రాష్ట్రాలకు ఓ సానుకూల ఉదాహరణగా ఉపయోగపడుతాయి. తెలంగాణలో అమలు చేసిన కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లో సమర్థంగా అమలుచేస్తే, అది కచ్చితంగా దేశ భవిష్యత్తుకు దోహదపడుతుంది.

ప్రశ్న: తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్‌ పాత్ర ఏమిటి?
చాట్‌జీపీటీ: తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్‌ది కీలకపాత్ర. రాష్ట్రప్రజలకు సుపరిపాలన అందించడానికి కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు. తెలంగాణ ఆవిర్భావంలోనే కాదు.. రాష్ట్రాభివృద్ధిలోనూ కేసీఆర్‌ పాత్ర మరువలేనిది.

ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతా?
చాట్‌జీపీటీ: సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించడానికి.. పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవన్నీ ఇందులో భాగమే.

ప్రశ్న: తొమ్మిదేండ్లలో తెలంగాణ రికార్డులేంటి?
చాట్‌జీపీటీ: రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏండ్లు గడువకముందే పలు అంశాల్లో మేటిగా నిలిచి తెలంగాణ పలు రికార్డులు సొంతం చేసుకొన్నది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, హరితహారం, తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, సౌర విద్యుత్తు, పీడీఎస్‌, ఐటీ ఇలా పలు రంగాల్లో దశాబ్దాలైనా జరగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలోనే సాధించింది.

ఏమిటీ చాట్‌ జీపీటీ? ఎలా పనిచేస్తుంది??
ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ-ఏఐ) టెక్నాలజీ ఆధారంగా ‘చాట్‌ జీపీటీ’ని తయారు చేశారు. ఇందులో చాట్‌ అనగా ‘మాట్లాడటం’. జీపీటీ అంటే ‘జనరేటివ్‌ ప్రీ ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌’.. అంటే ఈ చాట్‌ బోట్‌కు ముందుగా శిక్షణ ఇస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి కలపటం ద్వారా మనకు సాధారణ మనిషి తరహాలోనే సమాధానాలు ఇచ్చేలా చాట్‌ జీపీటీని తీర్చిదిద్దారు. ఏఐ టెక్నాలజీ మీద పరిశోధన చేస్తున్న శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘ఓపెన్‌ ఏఐ’ అనే కంపెనీ దీనిని ఆవిష్కరించింది.

Latest News

More Articles