Saturday, May 18, 2024

కోడో మిల్లెట్స్‎తో.. షుగర్, కొలెస్ట్రాల్‎కు చెక్..!!

spot_img

మారుతున్న జీవనశైలి…చెడు ఆహారపు అలవాట్ల వల్ల నేటి కాలంలో చాలామంది మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ రోగాలు జనాలను పట్టిపీడిస్తున్నాయి. అయితే మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆహారంతోపాటు జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే..ఈ సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి వ్యాధులలో ప్రయోజనకరంగా ఉండే పోషకాలను కలిగి ఉన్న అనేక తృణధాన్యాలు ఉన్నాయి. ఇప్పుడు కోడో మిల్లెట్ ( అరికెలు) గురించి తెలుసుకుందాం. ఇవి చూడటానికి అన్నం వలె ఉంటాయి. ఇవి ఔషధ గుణాలతో నిండి ఉంటాయి.

మధుమేహం:
కోడో అంటే అరికలు. ఇందులో ఉన్న ఆరోగ్యం గురించి చాలా మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం చాలా పెరిగింది. వైట్ రైస్ కు బదులుగా అరికెలను చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులకు మేలు చేసే పోషకాలన్నీ కూడా అరికెల్లో లభిస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

కొలెస్ట్రాల్:
అరికెలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సిరల నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు..మంచి కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతుంది.

అధిక రక్తపోటు:
రక్తపోటు రోగులు కూడా తమ ఆహారంలో అరికెలను చేర్చుకోవచ్చు. దీన్ని తినడం వల్ల మీ రక్తపోటు అదుపులో ఉంటుంది.

బరువు తగ్గడం కోసం:
అరికెల్లో ఫైబర్ లభిస్తుంది. దీనిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. అరికెలు మీ జీవక్రియ మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు అరికెలను ఆహారం చేర్చుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

కీళ్ల నొప్పులు:
అరికెలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఎముకలకు మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు కీళ్ల నొప్పుల సమస్య కూడా తగ్గుతుంది.

Latest News

More Articles