Friday, May 17, 2024

ద‌ళిత‌బంధు కోసం ఈ మొగోళ్లు ధ‌ర్నా చేశారా? సీఎం కేసీఆర్ ఫైర్

spot_img

ఖ‌మ్మం : కేసీఆర్ రాక‌ముందు ద‌ళితుల గురించి ఈ మొగోళ్లు ఎవరైనా ఆలోచన చేశారా? దళిత బంధు లాంటి పథకం ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శ్నించారు. ద‌ళిత‌బంధు పెట్ట‌మ‌ని నన్నుఎవ‌ర‌న్నా అడిగారా..? ద‌ళిత‌బంధు పెట్టిన‌ప్పుడు ఎన్నిక‌లు లేవు. న‌న్ను ఎవ‌రూ అడ‌గ‌లేదని స్పష్టం చేశారు. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Also Read.. హార్ట్ ఎటాక్‎తో యాక్టర్ ప్రియ మృతి

75 ఏండ్ల కింద స్వతంత్రం వ‌స్తే నాడు ద‌ళితుల ప‌రిస్థితి బాగా లేదు. దళితులు అనాదిగా అణిచివేత‌కు, విక్ష‌క‌కు గుర‌య్యారు. ఊరి నుంచి దూరంగా ఉండేవారు. అంట‌రానివారిగా నింద‌ల‌కు గుర‌య్యారు. మ‌హాక‌వి జాషువా బాధ‌ప‌డి గాయ‌ప‌డి కావ్యాలు కూడా రాశారు. ద‌ళిత జాతి ఎందుకు అలా ఉండాలి. వాళ్లు మ‌న‌షులు కారా.? మ‌న‌లాగా పుట్ట‌లేదా..? సాటి మాన‌వులు కారా? అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read.. రేవంత్ రెడ్డి మాట్లాడడం.. బలిసిన కోడి చికెన్ సెంటర్ ముందు తొడ గొట్టడమే.. కేటీఆర్ సెటైర్

ఇవాళ పెడ‌బొబ్బ‌లు ఒక్క సారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలని అని కేసీఆర్ సూచించారు. ద‌ళితుల‌ను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు త‌ప్పా వారి గురించి ఆలోచించ‌లేదని కాంగ్రెస్, బీజేపీలపై పరోక్షంగా మండిపడ్డారు. ద‌ళితుల‌కు అర‌చేతికి బెల్లం పెడుతా.. చ‌క్కెర‌, చాకెట్లు ఇస్తాన‌ని చెప్పి అప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌ల ముందు మురిపిస్తారని, ఆపై మోసం చేశారన్నారు. ద‌శాబ‌ద్దాల త‌ర‌బ‌డి ఓటు బ్యాంకుగా వాడుకున్నారని మండిపడ్డారు. దళితుల నిజ‌మైన శ్రేయ‌స్సు గురించి ఆలోచించ‌లేదని, వాళ్ల‌ను మ‌నషులుగా గుర్తించ‌లేదని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read.. ఎన్నికల శంఖారావం పూరించిన సబితమ్మ

ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న ఉత్త‌ర భార‌త‌దేశంలో ద‌ళితుల మీద రోజు దాడులే అని కేసీఆర్ గుర్తు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్‌, రాజ‌స్థాన్‌, ప్ర‌ధాని సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో చాలా భ‌యంక‌ర‌మైన దాడులు జ‌రుగుతున్నాయని తెలిపారు. ఏంది ఈ వివ‌క్ష‌, ఏంది ఈ దురాగ‌తం. ఇది ప్ర‌జాస్వామ్య దేశ‌మా..? అరాచ‌క‌మా..? అని నిలదీశారు. ఇవన్ని ఆలోచించి తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు పిడికెడు మంది కార్య‌క‌ర్త‌ల‌తో ద‌ళిత చైత‌న్య జ్యోతి అని పెట్టుకుని కొన్ని కార్య‌క్ర‌మాలు చేసినట్లు గుర్తుచేశారు. ఈ రోజు ద‌ళిత‌బంధుకు కూడా అదే స్ఫూర్తి అని కేసీఆర్ వివరించారు.

Also Read.. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్

రాష్ట్ర ఆదాయం మెరుగుప‌డ్డాక‌.. ద‌ళిత‌బంధు అమ‌లు చేశామ‌ని కేసీఆర్ తెలిపారు. ఎల‌క్ష‌న్ మేనిఫెస్టోలో పెట్ట‌ని ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని, ఎప్ప‌టిక‌ప్పుడు ఏది అవ‌స‌ర‌మో పెట్టుకుంటూ ముందుకు పోయామన్నారు. ప‌ది ఓట్లు రావాలని రాజ‌కీయాలు చేయ‌లేదు. ఎందుకంటే మేం తెలంగాణ తెచ్చిన‌వాళ్లం. మాకు బాధ్య‌త ఉంది. నూటికి నూరు శాతం బాగు చేయాల‌ని. చిల్ల‌ర రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా దళితులను బ్ర‌హ్మాండంగా బాగు చేయాల‌నే సంక‌ల్పంతో ముందుకు వెళ్లామని చెప్పారు. సొంత విచ‌క్ష‌ణ‌తో నిజ‌నిజాల గురించి నిల‌బ‌డి ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Latest News

More Articles