Friday, May 3, 2024

సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో పలువురు సెలబ్రిటీల్లో గుబులు..!

spot_img

హైదరాబాద్: సినీ నిర్మాత కె పి చౌదరి అరెస్టుతో మరోసారి సినీ డ్రగ్స్ లింక్స్ తెరమీదకు వస్తున్నాయి. కే పి చౌదరి అరెస్ట్ తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు పట్టుకుందని సమాచారం. రోషన్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ విచారణలో కేపీ చౌధరి వ్యవహరం వెలుగు చూసిన విషయం తెలిసిందే.

గోవా, హైదరాబాద్ లో నిర్వహించిన రోషన్ ప్రైవేట్ పార్టీలకు హాజరైన పలువురి ప్రముఖుల ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.  ఇదిలా ఉండగా.. కేపీ చౌదరి 4 మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 4 ఫోన్ ల నుండి కాల్ డేటాను సేకరిస్తున్నారు.

కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలెబ్రిటీల జాబితాను పోలీసులు తయారు చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్ట్ లు ఒక డైరెక్టర్వతో డ్రగ్స్ వ్యవహారం పై కేపీ చౌధరి చాటింగ్ చేసినట్లు గుర్తించారు. కేపీ చౌదరి 4 మొబైల్స్ తో పాటు గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 5 మొబైల్స్ ను విశ్లేషించే పనిలో పడ్డారు పోలీసులు.

మొత్తం 9 సెల్ ఫోన్ ల డేటా ద్వారా డ్రగ్స్ ముఠాతో  సెలబ్రిటీల లింకులను బయటికి తీయనున్నారు పోలీసులు. మరోవైపు డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతున్నది. కేపీ చౌదరి వాట్సప్, కాల్ డేటాను సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే సేకరించి విశ్లేషించే పనిలో పడ్డారు. దీని ఆధారంగా త్వరలోనే మరిన్ని కీలక అరెస్ట్ లు జరిగే అవకాశం ఉంది.

Latest News

More Articles