Friday, May 17, 2024

ఎవడికో ఓటు వేసి అభివృద్ధిని నాశనం చేసుకోవద్దు

spot_img

పరకాల: భారతదేశంలో రాజకీయ పరిణితి రావాల్సి ఉంటుంది. పరిణితి సాధించిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దు. అభ్యర్థుల గుణగణాలతోపాటు పార్టీల చరిత్ర చూడాలన్నారు. పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, బీఆర్ఎస్ అభ్యర్తి చల్లా ధర్మారెడ్డికి మద్దుతుగా మాట్లాడారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ కాదా. తెలంగాణ కోసం ఉద్యమించిన బిడ్డల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా. 33 రాష్ట్రాలు ఒప్పుకొన్నాక.. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేస్తే.. తెలంగాణను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఊరికే ఇయ్యలేదన్నారు.

Also Read.. బీజేపీకి ఓటేస్తే ఏమొస్తది? పాడి కౌశిక్ రెడ్డికి ఒక అవకాశం ఇయ్యాలి

గత పాలకుల జమానాలో 200 ఉన్న పింఛన్ ను 2000 వేలు చేసినం. మళ్లీ వస్తే 5000 కు పెంచుతామని చెబుతున్నాం. రైతుల కోసం రైతుబంధు తెచ్చినం. దీంతో సాగు నిలబడ్డది. గ్రామాలలో సంతోషం నెలకొన్నది. 24 గంటల ఉచిత కరెంట్ తో ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఇప్పుడు ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తొలిస్థానంలో ఉన్నాం. చల్లా ధర్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. ఫించన్లు, రైతుబంధును పెంచతామని సీఎం పిలుపునిచ్చారు.

Also Read.. కాంగ్రెస్ పార్టీది 420 మ్యానిఫెస్టో.. ఈటలవి జూటా మాటలు

కాంగ్రెస్ వైఖరి డేంజర్. వాళ్లకు ఓటేస్తే 3 గంటలు కరెంట్ ఇస్తామని చెబుతున్నారు. పెద్ద మోటర్లు పెట్టుకోవాలని చెబుతున్నారు. వాటికయ్యే పైసలు ఎవడియ్యాలే. వాళ్లయ్యా ఇస్తడా? అని నిప్పులు చెరిగారు. భూముల సమస్యలు తీర్చిన ధరణిని తీసి బంగాళఖాతంలో వేస్తామంటున్నారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు ఎట్ల వస్తది? మళ్లీ అధికారుల చుట్టూ తిరగాలా? ఇదేనా కాంగ్రెస్ నేతల ఆలోచనలు. కాంగ్రెస్ పెద్ద నాయకులు ఇలా చెబుతున్నారు. ప్రజలు ఆలోచన చేయాలి. ఓటే వేసే ముందు బాగా ఆలోచన చేయాలని సూచించారు. పరకాల అభివృద్ధి కోసం ధర్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.

Also Read.. వెయ్యి కోట్లతో కొండగట్టు అంజన్న ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా

కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలను మర్చిపోదామా? గతంలో రాత్రి పూట కరెంట్ తో ఎందరో రైతులు పాముకాటులకు చనిపోలేదా? తెలంగాణ వచ్చాక కరెంట్ సమస్యలను పరిష్కరించుకున్నం. 24 గంటల ఉచిత కరెంట్ ను ఇచ్చుకుంటున్నం. క్రమపద్ధతిలో ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నం. 10 ఏండ్లలో జరిగిన అభివృద్ధిని కొనసాగించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెల్వాలి. లేదా బూడిదలో పోసిన పన్నీరు కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఎవడికో ఓటు వేసి పరకాల అభివృద్ధిని నాశనం చేసుకోవద్దని సూచించారు.

Latest News

More Articles