Saturday, June 15, 2024

దుర్మార్గులకు ఓటేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావాలె

spot_img

డోర్నకల్‌: ఎన్నికల్లో ఆషామాషీగా ఓటు వేయొద్దు.. బాగా ఆలోచన చేయాలి. దుర్మార్గులకు ఓటేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావాలె అని సీఎం కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం డోర్నకల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. కురవి వీరభద్రస్వామి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. స్వామికి బంగారు మీసాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నామని తెలిపారు.

Also Read.. ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకున్నది ఒక్క కేసీఆర్‌ మాత్రమే

ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన దేశాలు అభివృద్ధిలో మనకంటే వేగంగా దూసుకుపోతున్నయని, మన దేశంలో ఆ పరిస్థితి రావాలె అని ఆకాంక్షించారు. సరైన పార్టీని గెలిపించుకుంటేనే రాష్ట్రం బాగుంటది అన్నారు. అలా కాకుండా దుర్మార్గులకు వేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావలె. మంచి వాళ్లకు వేస్తే మన తలరాతను మంచిగ రాస్తరు అని పేర్కొన్నారు.

Also Read.. ఈ సారి దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే

మీ తండాల్లో, గ్రామాల్లో ఎవరికి ఓటు వేయాలనే దానిపై చర్చ పెట్టాలని సూచించారు. అభ్యర్థులు ఎలాంటోళ్లు..? ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలు ఎలాంటివి అనే చర్చ జరగాలన్నారు. ఈ విధంగా చర్చ జరిగితేనే రాయేదో.. రత్నమేదో తెలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసం.. తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసమన్నారు.

Also Read.. క‌రువు కాంగ్రెస్ పుణ్య‌మే

కాంగ్రెస్‌ 50 ఏండ్ల పాలనలో ఏం జరిగింది..? పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏం జరిగింది..? అనేదానిపై ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 పెన్షన్‌ ఇచ్చేటోళ్లుని, తాము వచ్చినంక దాన్ని ముందుగా రూ.1000 చేసినం. తర్వాత రూ.2 వేలకు పెంచుకున్నట్లు పెరిగారు. మళ్లీ వస్తే రూ.5 వేలకు పెంచుతామన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో పేరుకే కాలువలు ఉండె తప్ప ఎన్నడూ నీళ్లను కండ్ల జూడలేదన్నారు.

Also Read.. కాంగ్రెస్‌లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు

డోర్నకల్‌లో అయితే కాలువల్లో చెట్లు మొలిచినయ్‌ అని గుర్తుచేసుకున్నారు. బీహార్‌ నుంచి ఆర్థికవేత్త జీఆర్‌ రెడ్డిని రప్పించి, అనేక మంది ఆర్థికవేత్తలతో చర్చించి ప్రజా క్షేమం కోసం ఓ మార్గం వేసినామని, ఈరోజు తెలంగాణ అనేక రంగాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Latest News

More Articles