Sunday, May 12, 2024

బాల్కొండ గడ్డపై ‘మోతే గ్రామం’ను గుర్తు చేసుకొని.. సీఎం కేసీఆర్ ఎమోషనల్

spot_img

నిజామాబాద్‌ జిల్లా: బాల్కొండ గడ్డపై ‘మోతే గ్రామం’ను గుర్తు చేసుకొని సీఎం కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. బాల్కొండ నియోకవర్గానికి ఎప్పుడు వచ్చినా మొదటిసారిగా జ్ఞాపకం వచ్చేది మోతే గ్రామమని పేర్కొన్నారు. ఆ మట్టిలో ఉన్న బలం అటువంటిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ముందు మోతే గ్రామమే తీర్మానం చేసి.. తెలంగాణ కావాలని పిడికిలెత్తిన నిలబడ్డ గ్రామం అని వివరించారు.

Also Read.. కేరళ సీఎంను చంపేస్తానంటూ 12 ఏండ్ల బాలుడి వార్నింగ్

‘‘ఆ గ్రామం మట్టిని ముడుపుకట్టి హైదరాబాద్‌ తీసుకుపోయాను. మళ్లీ తెలంగాణ వచ్చిన తర్వాత అదే మట్టిని తీసుకువచ్చి గ్రామంలో కలిపారు. ఈ సందర్భంగా మోతె గ్రామానికి శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను.’ అని సీఎం తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేగా మరోసారి వేముల ప్రశాంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Latest News

More Articles