Sunday, May 19, 2024

మల్లారెడ్డిని మెచ్చుకున్న కేసీఆర్.. మేడ్చల్ సభలో సప్పట్ల మోత

spot_img

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ మేడ్చల్ సభలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జడ్చెర్లలో జరిగిన భహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చెల్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..’రంగారెడ్డి జిల్లా పరిపాలన సంస్కరణలో భాగంగా మేడ్చల్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాము. 20 ఏండ్ల కింద ఉద్యమం చేస్తే కొంతమంది నవ్వారు. చాలా మంది అవహేళన చేశారు. వాటిని దిగమింగుతు పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్నాం. అప్పుడు కరెంట్ లేదు, త్రాగు నీరు లేదు. భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చనిపోతే అక్కడి వెళ్ళాను. మాకు నిధులు ఇవ్వండి ఒక్క రూపాయి ఇవ్వము అన్నారు.అప్పటి కాంగ్రెస్ నాయకుల వలన 58 ఏండ్లు ఇబ్బందులు పడ్డాము.

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం. ఉచితంగా డబుల్ బెడ్ రూం లను అందించాము. మరి లక్ష ఇండ్లను కడతామని మేనిఫెస్టో లో పెట్టాము. కొంతమంది మాయమాటలు చెప్పడానికి వస్తారు జాగ్రత్తగా ఉండండి. బిఆర్ఎస్ పార్టీకి మి సపోర్ట్ ఇవ్వండి. శివారు ప్రాంతాలకు వివిధ ప్రాంతాల నుండి వలసలు వస్తారు. అక్కడ సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు ఇస్తాము. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న 93 లక్షల కుటుంబాలకు బీమా కల్పిస్తాము. అన్నపూర్ణ స్కీమ్ కింద సన్నబియ్యం అందిస్తాము. పెన్షన్ లను ఐదేండ్ల లో ఐదు వేలకు తీసుకుపోతాము. రైతు బందును ఐదేండ్ల లో 16 వేలకు తీసుకుపోతాము.

బిఆర్ఎస్ కార్యకర్తలు నెలరోజులు యజ్ఞంల తీసుకుని పనిచేయండి. మేడ్చెల్ జిల్లా ఓటర్లు చైతన్యవంతులు. మీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కింద నుండి పైకొచ్చాడు. కష్టాలు తెలిసిన మల్లారెడ్డి మీకు ఎమ్మెల్యేగా ఉండటం మేడ్చెల్ ప్రజల అదృష్టం. మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి’ అని ప్రశంసించారు సీఎం కేసీఆర్. దాంతో భారీగా హాజరైన ప్రజల హర్షద్వానాల మధ్య సీఎం కేసీఆర్ మేడ్చెల్ బహిరంగ సభ విజయవంతంగా ముగిసింది,.

Latest News

More Articles