Sunday, May 19, 2024

జుక్కల్ ను మరింత అభివృద్ది చేసే బాధ్యత నాది

spot_img

ఎన్నికలప్పుడు ఆగం ఆగం కాకుండా స్వంత విచక్షణతో ఓటు వేయాలన్నారు సీఎం కేసీఆర్. ప్రజా స్వామ్యంలో ఓటు ఒక బ్రహ్మస్త్రం అని అన్నారు. ఇవాళ(సోమవారం) మహబూబ్ నగర్ జిల్లా జుక్కల్ లోని ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాక ముందు మన పరిస్థితి ఎట్లా ఉండే.. ఇపుడు ఎట్లా అయింది చర్చ జరపాలి. దయనీయమైన పరిస్థితిలో వలసలు,రైతు కష్టాలు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సమైక్య పాలన లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ కోసం కాంగ్రెస్ తో అప్పట్లో పొత్తు కడితే మనని మోసం చేశారు. చివరికి నేనే ఆమరణ దీక్షకు పూనుకున్నా..గతి లేని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు.

గతం లో జుక్కల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసునని అన్నారు సీఎం కేసీఆర్. ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల తో తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అని తెలిపారు. పవిత్ర త్రివేణి సంగమంలాంటి ప్రాంతంలో ఉన్న నియోజక వర్గం.. జుక్కల్ నియోజక వర్గం అన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర లో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. కర్ణాటకలో రైతులను మోసం చేసి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ కేవలం 5 గంటల కరెంట్ ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తెలివి తక్కవ దద్దమ్మ..కేవలం 5 గంటల కరెంటు ఇచ్చే కర్ణాటక గొప్ప అని చెబుతున్నాడన్నారు. రైతు బందు దుబారా అని ఉత్తమ కుమార్ రెడ్డి అంటున్నారు…రైతు బందు అనే పదాన్ని సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో రెండు దఫాలుగా 37 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసుకున్నాం…ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం బీఅర్ ఎస్ ప్రభుత్వమన్నారు. జుక్కల్ లోని లెండి ప్రాజెక్ట్ కు పూర్వ వైభవం తెస్తాం..నగమడుగు లిఫ్ట్ పనులు రెండు నెలల్లో పూర్తి చేయిస్తాం…కాళేశ్వరం నీల్లతో నిజాం సాగర్ కల కల లాడుతోందన్నారు సీఎం కేసీఆర్.

దళిత వర్గాల ప్రజలను ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుందని విమర్శించారు సీఎం కేసీఆర్. జుక్కల్ ను మరింత అభివృద్ది చేసే బాధ్యత నాది అని తేల్చి చెప్పారు. హన్మంతు షిండే ను భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రామాణికం తల సరి ఆదాయం, విద్యుత్ వినియోగమన్నారు. 3లక్షల 18 వేల తలసరి ఆదాయంతో దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగం 22 వందల యూనిట్ లు…ఇందులో కూడా మనమే దేశంలో నంబర్ వన్ గా ఉన్నామన్నారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి

Latest News

More Articles