Monday, May 20, 2024

ఢిల్లీ గడ్డపై తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. ప్రారంభానికి సర్వం సిద్ధం

spot_img

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం గం.1.05నిమిషాలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం బీఆర్ఎస్ కార్యాలయం ముందు నవ చండి హొమాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. అనంతరం వాస్తు పూజలను చేయనున్నారు.

ప్రత్యేకతలు

1,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ+3 గా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్, కార్యాలయ కార్య దర్శి, మేనేజర్, చాంబర్లతోపాటు మీటింగ్ హాల్ ఉన్నాయి. మొదటి అంతస్థులో పార్టీ అధ్యక్షుడి ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్, వెయిటింగ్ హాల్స్ నిర్మించారు. రెండో అంతస్థులో డార్మెటరీ రూంలు, నేతల బసకోసం ప్రత్యేక సూట్స్ ఉన్నాయి. మూడో అంతస్థులో ప్రత్యేక గదులు, సూట్స్ లను నిర్మించారు.

సెప్టెంబర్ 2న భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్

సెప్టెంబర్ 2, 2021న కార్యాలయ నిర్మాణానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం నిర్మాణ పనులను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. నిర్మాణం జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్  పలుమార్లు పనులను పర్యవేక్షించి.. పలు సూచనలు, సలహాలు చేశారు.

Latest News

More Articles