Saturday, May 18, 2024

కోదండ రాం రాం.. మాస్టర్ కి మైండ్ బ్లోయింగ్ షాక్..!

spot_img

పెద్దల ముసుగులో కొందరు తెలంగాణకి తీవ్ర అన్యాయం చేస్తుంటారు. పైకి ప్రజల కోసమంటూ పదవుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఏర్పడిందో లేదో అలా పడేద్దామనుకున్నారు కొందరు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని దించేయాలని చాలామంది చాలానే ప్రయత్నాలు చేశారు. వీరిలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించగా.. కొన్ని వార్త చానళ్ళు కోదండరాం పేరుని కూడా జోడించాయి అప్పట్లో. ఇది ముందుగానే పసిగట్టిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. రేవంత్ రెడ్డి, చంద్రబాబులకు సరైన గుణపాఠం చెప్పినా.. ఎందుకో కోదండరాంని మాత్రం పెద్ద మనసుతో క్షమించి వదిలేశారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటి కోదండరాం గత 10 ఏళ్ళ నుండి తెలంగాణ, బీఆర్ఎస్ లపై కుట్రలు పన్నుతూనే వున్నారు.

ఇక గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి మద్దత్తు ఇచ్చారు కోదండరాం. అయితే ఇదంతా కూడా ప్రజల కోసం కాదు.. కేవలం పదవుల కోసమేనని కొద్దీ రోజుల క్రితం కోదండరాం సారూ బాహాటంగా చెప్పేసారు. తనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుందని మాట ఇచ్చినట్టు బహిరంగంగా ప్రకటించారు ఆయన. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న కోదండరాంకి తాజాగా షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తాడని పేరున్న అద్దంకి దయాకర్ కి కూడా మొండి చేయినిచ్చింది కాంగ్రెస్. పాపం ఎమ్మెల్సీగా గెలిచి డైరెక్ట్ గా మంత్రి అయిపోవచ్చనుకున్న కోదండరాం మాస్టర్ కి గట్టి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్.

Latest News

More Articles