Tuesday, May 21, 2024

టార్గెట్ రేవంత్.. కాంగ్రెస్‌లో కొత్త కుంపటి

spot_img

కాంగ్రెస్ లో రేవంత్‌రెడ్డి ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు ఆయనకు పోటీగా మరో నేతను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై ఇటీవల మేడ్చల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి పార్టీలో కొందరి నేతల స్థానానికి ముప్పు ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.

సీనియర్ నాయకుల గురించి పార్టీ పెద్దలకు తప్పుడు సమాచారం ఇస్తూ వారందర్నీ అధిష్ఠానానికి దూరం చేసేలా రేవంత్‌ కుట్రలు చేస్తున్నారని.. అందుకే రేవంత్ కి పోటీగా అధిష్ఠానం వద్ద తమ గ్రూప్‌ నుంచి ఒక నేతను ప్రొజెక్ట్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు బడా నేతలు రహస్యంగా సమావేశమై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ నేతను రేవంత్ కి పోటీగా ముందుచుంచాలి డిసైడ్ అయ్యారట. ఇలాఐతేనే రేవంత్‌రెడ్డి దారిలోకి వస్తారని లేదంటే ఆయనను కట్టడి చేయడం కష్టమని భావిస్తున్నారు. అతి త్వరలోనే ఈ నేతలంతా ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Latest News

More Articles