Saturday, May 18, 2024

‘ముద్దు’పై ముదురుతున్న వివాదం..!

spot_img

స్పెయిన్ ఫుట్‌బాల్‌లో ముద్దు వివాదం ముదురుతోంది. ఫుట్‌బాల్ స‌మాఖ్య అధ్య‌క్షుడు లూయిస్ రూబియేల్స్‌ చర్యలు వివాదస్పదమయ్యాయి. త‌న అంగీకారం లేకుండానే ముద్దు పెట్టుకున్నాడ‌ని మిడ్ ఫీల్డ‌ర్ జెన్నిహెర్మొసో తాజాగా ఆరోపించింది.

దాంతో, ఆదేశ ఫుట్ బాల్ స‌మాఖ్య‌ అధ్య‌క్షుడు రూబియేల్స్‌కు సంపూర్ణ మ‌ద్దుతు ప్ర‌క‌టించింది. అత‌డిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను న్యాయ ప‌రంగా ఎదుర్కొంటామ‌ని స్పష్టం చేసింది. జెన్నిహెర్మొసో, ఆమె క్యాంప్ చేస్తున్న ఆరోప‌ణ‌లను కోర్టులో తేల్చుకుంటామని ఫెడ‌రేష‌న్ స‌మాఖ్య ప్ర‌క‌టించింది.

వివాదం ఇదే

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో 2023లో ఇంగ్లండ్‌పై స్పెయిన్ మ‌హిళ‌ల జ‌ట్టు గెలుపొందింది.అనంతరం మైదానంలో సంబురాలు చేసుకుంది. ఆ త‌ర్వాత విజేత‌ల‌కు మెడ‌ల్ ప్ర‌దానం చేస్తున్న‌ స‌మ‌యంలో జెన్నీని లూయిస్ అభినందించి పెద‌వుల‌పై ముద్దు పెట్టాడు. అది వైరల్ అయింది. దీంతో లూయిస్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే.. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ముద్దు పెట్టుకోవ‌డం జ‌రిగిందిని చెప్పిన‌ రూబియేల్స్.. జరిగిన దానికి సారీ చెప్పాడు.

Latest News

More Articles