Saturday, May 18, 2024

పిల్లల్ని కనడానికి వ్యక్తికి 4 వారాల పెరోల్ ఇచ్చిన కోర్టు

spot_img

జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి.. తన భార్యతో పిల్లల్ని కనడానికి కోర్టు పెరోల్ మీద విడుదల చేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన కుందన్ సింగ్ (41) 2007లో ఓ మర్డర్ కేసులో అరెస్టయ్యాడు. విచారణ జరిపిన కోర్టు.. 2014లో దోషిగా తేల్చి.. జీవితకాల శిక్ష విధించింది. దాంతో ఆయన అప్పటినుంచి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా.. జైలుకు వెళ్లడానికి ముందే కుందన్‎కు పెళ్లి అయింది, కానీ పిల్లలు లేరు. దాంతో తన వంశం అభివృద్ధికి, వృద్ధాప్యంలో చూసుకోవడానికి తమకు ఓ బిడ్డ కావాలని కుందన్ భార్య భావించింది. ఈ విషయమై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Read Also: పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

ఆమె వాదనలు విన్న కోర్టు.. కుందన్ కు 4 వారాల పెరోల్ ఇస్తూ తీర్పు చెప్పింది. తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకూ ఉంటుందని స్పష్టం చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ….శిక్షా కాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరిపోతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని స్పష్టం చేశారు. దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని, కేవలం వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు జడ్జి తెలిపారు. కుందన్ ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్నీ న్యాయమూర్తి ప్రస్తావించారు.

Latest News

More Articles