Sunday, May 19, 2024

జిల్లాలకు విస్తరిస్తున్న కరోనా.. కేసుల వివరాలు దాస్తున్న ఆరోగ్యశాఖ

spot_img

రాబోయే నాలుగు వారాల్లో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జనవరి తొలివారంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే ఛాన్స్‌ ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జేఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్‌లో కేసులు వెలుగు చూశాయి.

Read Also: సీఎం, డిప్యూటీ సీఎంలు తెలంగాణ ఉద్యమంలో లేరు.. కనీసం కొట్లాడిన వాళ్లు కూడా కాదు

కాగా.. కరోనా కేసులు తెలంగాణలో అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‎లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 63 కేసులు నమోదు కాగా… కేవలం హైద్రాబాద్‎లోనే 53 కేసులు ఉండటం గమనార్హం. అయితే జిల్లాల్లో కూడా వందల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నా… పాజిటివ్ వచ్చిన కేసుల వివరాలు బులిటెన్‎లో వైద్యశాఖ చూపడంలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా సర్కారు లెక్కలు ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న కేవలం 8 కేసులు మాత్రమే వచ్చినట్లు కరోనా బులిటెన్ విడుదలయింది. అయితే నిన్న 1333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని సమాచారం. వారిలో కేవలం 8 కేసులే పాజిటివ్ అని బులిటెన్ విడుదల చేయడంతో అనుమానం మొదలైంది. దాంతో సర్కార్ విడుదలచేసిన కరోనా లెక్కలను జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు ఖచ్చితంగా మాస్క్‎లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతాయనే టెన్షన్‎లో వైద్యారోగ్య శాఖ ఉంది. న్యూఇయర్‎ను దృష్టిలో ఉంచుకొని, కరోనా కేసుల కోసం ఆస్పత్రులను కూడా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.

Latest News

More Articles