Monday, May 20, 2024

మినీ జమిలి ఎన్నికలకు కేంద్రం కుట్రలు

spot_img

ప్రజాస్వామ్యాన్ని చంపేలా కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు నల్గొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపనున్నామని.. ఈ వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 17న మరోసారి అమరులను స్మరించుకుందాం. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేలా కుట్రలు చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి.. కానీ కేంద్రం ఏదో కుట్ర చేస్తుంది. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం గందరగోళం సృష్టించింది. కుట్రలు చేసి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలన్నదే కేంద్రం ప్రయత్నం. అందుకే మినీ జమిలి ఎన్నికలు జరిపేందుకు కేంద్రం కుట్రలు చేస్తూ.. రాజకీయ పార్టీలను గందరగోళంలోకి నెట్టింది. న్యూసెన్స్ చేస్తూ గట్టు ఎక్కాలనేదే కేంద్రం దురాలోచన. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్‎ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‎ని గెలిపించాలి. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తుంటే నవ్వు వస్తుంది. కేసీఆర్ మంత్రివర్గంలో ద్రోహులు ఉన్నారని అంటున్న కాంగ్రెస్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్‎లో తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు చేరారు. షర్మిల కూడా కాంగ్రెస్‎లో చేరుతుంది. తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్. షర్మిల తెలంగాణా వ్యతిరేకి కాదా? ఈ సారి హైదరాబాద్‎లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టస్తున్నది.

Also Read: సామాన్యులకు షాక్.. 45 శాతం పెరిగిన కందిపప్పు ధర

కేటీఆర్ సమర్థుడు, గొప్పగా చదువుకున్న వ్యక్తి. హైదరాబాద్ విశ్వ నగరంగా మారిందంటే అది కేటీఆర్ వల్లనే. అనవసర ఆరోపణలు చేయడం కాంగ్రెస్‎కు తగదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలవి పగటి కలలే. బీఆర్ఎస్ వల్లనే సుస్థిరమైన పాలన ఉంటుంది’ అని గుత్తా అన్నారు.

Latest News

More Articles