Saturday, May 4, 2024

నిమజ్జనం ఆలస్యంపై సీపీ సీవీ ఆనంద్ వివరణ

spot_img

హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఘట్టం ముగింపు దశ కు చేరుకుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈసారి భారీ గా విగ్రహలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయిందన్నారు. ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేష్ ను ముందుగా నిమజ్జనం చేసామన్నారు. నెక్లెస్ రోడ్డు, పీపుల్ ప్లాజా లో విగ్రహలు ఉన్నాయని తెలిపారు. వాటి నిమజ్జనానికి 5గంటల సమయం పడుతుందన్నారు.

Also Read.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన కూతురు.. కుటుంబ సభ్యుల దాడి

జియో టాకింగ్ లెక్కల ప్రకారం.. 10,020 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఐదు ఫీట్ల లోపు 50 నుండి 60 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. గతేడాది కంటే ఈ ఏడాది  10 నుండి 15% ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారు. బషిర్ బాగ్, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ లో మొత్తం 5మంది వివిధ ప్రమాదాల్లో చనిపోయారని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా షి టీమ్స్ 250పైగా కేసులను నమోదు చేసారని సీపీ తెలిపారు.

Latest News

More Articles