Saturday, May 4, 2024

టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రుడు ..ఎవరి హస్తం ఉందంటూ చర్చ..!!

spot_img

తెలంగాణలో అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ సర్కార్..టీఎస్ పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా నియమించింది. ఆయనతోపాటు మరో ఐదుగురు అధికారులను సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టీఎస్పీఎస్సీలో ఆంధ్రాకు చెందిన వ్యక్తి యరబాడి రామ్మోహన్ కు రేవంత్ ప్రభుత్వం చోటు కల్పించడంపై ఇఫ్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

నిజానికి రామ్మోహన్ రావు .. ఏపీలోకి క్రుష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ సర్కార్ ఆయనను ఏపీ వ్యక్తిగా గుర్తించింది. ఆయన ఏపీకి వెళ్లకుండా తెలంగాణను ఆప్షన్ గా ఎంచుకున్నాడు. కానీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. తెలంగాణలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే రామ్మోహన్ రావు ఈ మధ్యే పోస్టింగ్ తీసుకుని టీఎస్ జెన్ కో ఈడీగా కొనసాగుతున్నారు. ఆయన ఏప్రిల్ లో పదవీ విరమణ కావాల్సింది. ఈ తరుణంలో రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ఎవరి హస్తం ఉందంటూ చర్చ జోరుగా సాగుతోంది.

బోర్డుపై తీవ్ర విమర్శలు:
ఏపీకి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించడంపై చర్చ జరుగుతోంది. ఏపీకి చెందిన వ్యక్తి కి కాకుండా తెలంగాణ వారిని సభ్యులుగా నియమిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: విద్యార్ధినిపై అనుచితంగా వ్యవరించిన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్

Latest News

More Articles