Monday, May 20, 2024

కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్ శాంతికుమారి

spot_img

మిగ్ జాం తుఫాను ప్రభావంతో రాగల రెండురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ(మంగళవారం) రేపు( బుధవారం) ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మిగ్ జాం తుఫాను కారణంగా తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చూడాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లకు సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఎన్నికలు అయిపోయాయి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి

Latest News

More Articles