Saturday, May 18, 2024

సోషల్ మీడియా లింకులతో 400 కోట్లు కొట్టేసిన కేటుగాడు

spot_img

సోషల్ మీడియాలో లింకులు పంపి, వాటితో కోట్ల రూపాయలు కొట్టేశాడు ఓ సైబర్ నేరగాడు. దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్‎లలో ఇన్వేస్ట్‎మెంట్ పేరుతో లింకులు పంపి ఏకంగా రూ. 400 కోట్లు కొట్టేశాడు. ఈ కొట్టేసిన మొత్తాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సైబర్ నేరంలో కీలక సూత్రధారి అయిన రోనాక్ భరత్ కాకడేను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబర్ చీటర్స్ ఈ లింకులు పంపి ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే రోజుకు లక్షల్లో కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మన దేశంలో అనేక మంది బ్యాంక్ అకౌంట్స్ వివరాలు సేకరించాడు. వందల సంఖ్యలో ఏజంట్ల పెట్టుకొని, నకిలీ అకౌంట్లు క్రియేట్ చేశాడు. సైబర్ క్రైమ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఈ ఫేక్ అకౌంట్స్‎కి బదిలీ చేసేవారు. ఆ అకౌంట్స్ ద్వారా చైనా, తైవాన్ దేశాలలో ఉన్న వారికి డబ్బు పంపించేవారు. కోట్ల రూపాయలను బిట్ కాయిన్ రూపంలో నకిలీ అకౌంట్ల ద్వారా చైనా, తైవాన్‎కి ట్రాన్స్‎ఫర్ బయటపడింది. ఇన్వెస్ట్‎మెంట్ ద్వారా మోసపోయిన హైదరాబాద్‎కి చెందిన ఓ బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితుడు రోనాక్ భరత్‎ను ముంబైలో అరెస్ట్ చేశారు. భరత్ మీద దేశ వ్యాప్తంగా 50 కేసులు ఉన్నాయి.

Latest News

More Articles