Sunday, May 19, 2024

యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో అక్రమాలు..సైబర్ క్రైమ్ పోలీసుల దాడి..!

spot_img

నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో యూత్ కాంగ్రెస్ ఆఫీసుపై నలుగురు ఆధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు జరిపిన సోదాల్లో.. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కంప్యూటర్ హార్డ్ డిస్క్ తో పాటు కొన్ని ఫైల్స్ కూడా సీజ్ చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లో ఈ యూత్ కాంగ్రెస్ కార్యాలయం నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఇక ఈ నెల 5న తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచార చేస్తున్నారని ఉత్తమ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజహిల్స్ లోని యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే ఈ దుష్ప్రచారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి కూత వేటు దూరంలోనే యూత్ కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇక ప్రశాంత్ ని ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Latest News

More Articles