Friday, May 17, 2024

ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు వచ్చిన పార్శిల్

spot_img

చైనాకు చెందిన ఓ వస్తువును ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే..అది రోజులకో, నెలకో ఆ పార్సిల్ డెలివరీ కాలేదు. ఏకంగా నాలుగేళ్లకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఈ పోర్టల్ లో ఒక వస్తువు కోసం ఆర్డర్ చేశాడు. అది కూడా కోవిడ్ ముందు.

2019లో చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ పోర్టల్ పై తాను ఆర్డర్ చేయగా.. అది నాలుగేళ్ల తర్వాత చివరికి ఇటీవలే డెలివరీ అయిందంటూ ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ తెలిపాడు. ఎవరూ ఆశని కోల్పోకూడదంటూ మెసేజ్ ఇచ్చాడు. అలీ ఎక్స్ ప్రెస్ ను మన దేశంలో నిషేధించక ముందు దానిపై ఆర్డర్ చేసినట్టు తెలిపాడు.

చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ అనే వెబ్ పోర్టల్ ప్రస్తుతం మన దేశంలో నిషేధిత జాబితాలో ఉంది.

Latest News

More Articles