Sunday, May 19, 2024

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై 15న విచారణ

spot_img

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు లో అరెస్టై గతేడాది కాలంగా తీహార్ జై ల్లో ఉంటున్న ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 15న తదుపరి విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ప్రకటించింది.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ఏడాది కాలంలో తీహార్ జైల్లో ఉంటూ ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ED), సీబీఐ (CBI) విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇదే కేసులో అరెస్టయ్యి తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో మనీశ్‌ సిసోడియా ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌పై ఇప్పటికే సిసోడియా తరఫు న్యాయవాది, ఈడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అప్పట్లో తదుపరి విచారణను నిరవధిక వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 15న చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: రాజేంద్రనగర్‌లో రూ.2.5 కోట్ల నిషేధిత సిగరెట్లు సీజ్‌

Latest News

More Articles