Tuesday, May 14, 2024

డిప్యూటీ సీఎంగా భట్టి బాధ్యతలు

spot_img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పై రెండవ సంతకం చేశారు.

ఇక రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వేద పండితుల మంత్రాల మధ్యలో తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ఆ తరువాత తన కుర్చీలో కూర్చొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం సంబంధించిన ఫైళ్లను అందజేశారు కార్యదర్శులు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.

Latest News

More Articles