Sunday, May 19, 2024

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ గుడ్‌న్యూస్‌

spot_img

న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా డిస్నీ+ హాట్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను మొబైల్‌ యాప్‌లో ఫ్రీగా తిలకించేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ సంస్థ.. తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది.

Also Read.. విషమిచ్చి ఇమ్రాన్‌ను చంపేందుకు కుట్ర!

మొబైల్‌ యూజర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌ కొత్తగా మ్యాక్స్‌ వ్యూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ఫీచర్ ద్వారా వర్టికల్‌ మోడ్‌లో క్రికెట్‌ను వీక్షించొచ్చు. ఇంకా ఈ మోడ్‌లో లైవ్‌ ఫీడ్‌ ట్యాబ్‌, స్కోర్‌ కార్డు ట్యాబ్‌ కూడా కనిపిస్తాయి. దీంతో పాటు యూజర్‌ తనకు నచ్చిన ప్లేయర్‌ను మ్యాక్స్‌వ్యూ, స్ప్లిట్‌ వ్యూలోనూ చూసేయొచ్చు. దీంతోపాటు హైక్వాలిటీలో మ్యాచ్‌లు చూసిన తక్కువ డేటా ఖర్చయ్యే విధంగా తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసినట్లు పేర్కొంది.

Also Read.. పిచ్చికుక్క కరించిందా.. రెచ్చిపోయిన కేటీఆర్

కొత్తగా కమింగ్‌సూన్‌ ట్రే అందుబాటులోకి వచ్చింది.ఇందులో రానున్న కంటెట్‌ వివరాలు కనిపిస్తాయి. దాంట్లో నచ్చిన వాటికి రిమైండర్‌ సెట్‌ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఫ్రీ కంటెంట్‌ను, పెయిడ్‌ కంటెంట్‌ను వేర్వేరుగా ఇకపై చూడొచ్చు. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లు మొబైల్‌ యాప్‌లో మాత్రమే ఫ్రీగా లభిస్తాయి. కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌ల్లో వీక్షించాలంటే మాత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే.

Latest News

More Articles