Sunday, May 19, 2024

నేడు మరో 17864 డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

spot_img

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ హైదరాబాద్‎లో ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే 1వ, 2వ, 3వ విడతలో ఇండ్ల పంపిణీ చేసిన ప్రభుత్వం.. మూడో విడత ఎంపికైన మరికొంత మంది లబ్దిదారులకు నేడు ఇండ్ల పంపిణీ చేయనుంది. మొదటి విడతలో 11,700 మందికి, రెండో విడతలో 13,200 మందికి ఇండ్లను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మూడో విడతలో 36,884 మందిని ఎంపిక చేసి, అక్టోబర్ 2న 19,020 మందికి ఇండ్ల పట్టాలు అందించారు. మిగతావారికి 17864 మందికి ఈ రోజు పట్టాల పంపిణీ చేయనున్నారు.

Read Also: కానిస్టేబుళ్ల ఫైనల్ లిస్ట్ విడుదల.. ఎంపికైన వారు వెంటనే ఈ పని చేయండి

కాగా.. ఈ ఇండ్లను మంత్రులు, మేయర్ తమ చేతుల మీదుగా అందించనున్నారు. అయితే మంత్రులు, మేయర్ ఈ ఇండ్లను ఎక్కడెక్కడ పంపిణీ చేయాలో ముందుగానే నిర్ణయించారు. దాని ప్రకారం ఆయా ప్రాంతాల్లో మంత్రులు ఇండ్ల పంపిణీ చేస్తారు. కాగా.. లబ్ధిదారులను బస్సుల ద్వారా ఇండ్ల పంపిణీ ప్రాంతానికి ఉచితంగా తీసుకెళ్తారు.

ఎవరెవరు ఎక్కడ పంపిణీ చేస్తారంటే..
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్‎లో 2550 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హోం మంత్రి మహమ్మద్ అలీ పంపిణీ చేయనున్నారు.

పటాన్ చెరు నియోజకవర్గం కొల్లూరులో 7241 బెడ్ రూమ్‎లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేయనున్నారు.

మేడ్చల్ నియోజకవర్గంలోని మురహారి పల్లిలో 2376 డబుల్ బెడ్ రూమ్‎లను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేయనున్నారు.

మేడ్చల్ నియోజకవర్గంలోని తూముకుంటలో 1548 డబుల్ బెడ్ రూమ్‎లను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పంపిణీ చేయనున్నారు.

మేడ్చల్ నియోజకవర్గంలోని రాంపల్లిలో 2845 డబుల్ బెడ్ రూమ్‎లను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ పంపిణీ చేయనున్నారు.

మేడ్చల్ నియోజకవర్గంలోని కొర్రెములలో 720 డబుల్ బెడ్ రూమ్‎లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేయనున్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని చైతన్య నగర్‎లో 396 డబుల్ బెడ్ రూమ్‎లను మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేయనున్నారు.

Latest News

More Articles