Monday, May 20, 2024

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ

spot_img

హైదరాబాద్: సిఎం కేసీఆర్ ఆదేశాలతో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేపట్టనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు తెలిపారు. వైద్యారోగ్య శాఖ డే రోజు నుండి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈరోజు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారుతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీహెచ్సీలు, సబ్ సెంటర్ల నిర్మాణ, మరమ్మతు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సిద్ధమైన బస్తీ, పల్లె దవాఖానలు వెంటనే ప్రారంభించాలన్నారు. 80 రోజుల్లో కంటి వెలుగు ద్వారా కోటి 50 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహణ గొప్ప విషయమన్న మంత్రి.. అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

More Articles