Sunday, May 19, 2024

రోగి చికిత్సకు నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోవద్దు!!

spot_img

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారుకానీ, వారి బంధువులు కానీ చికిత్సకు నిరాకరించినట్లయితే ఆ రోగులను ఆసుపత్రుల యాజమాన్యాలు ఐసీయూల్లో చేర్చుకోకూడదని కేంద్ర ఆరోశ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 24 మంది నిపుణులు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం.

– తీవ్ర వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచుల్లో ఉన్నవారికి ఇతర చికిత్సలేనప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగలేకుంటే వారిని ఐసీయూల్లో చేర్చడం వృథా.

– ఐసీయూ చికిత్సలు వద్దనుకుంటే ఈ మేరకు లివింగ్ విల్ రాసిన వారిని ఆ విభాగంలో చేర్చుకోవద్దు.

-కోవిడ్ వంటి మహమ్మారులు, విపత్తుల సమయంలో పరిమిత వనరులు వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోని.. ఐసీయూల్లో రోగులను ఉంచే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలి.

– ఈ మధ్యకాలంలో మానసిక చేతనలో మార్పులు రావడం, రక్తప్రసరణ వ్యవస్థలో అస్థిరత, శ్వాస వ్యవస్థకు తోడ్పాటు అవసరమైన వారు, తీవ్ర అనారోగ్యం కారణంగా నిశిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, ఏదైనా అవయవానికి తోడ్పాటు అవసరం కావడం, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థతి క్షిణించే అవకాశమున్న వ్యాధులతో బాధపడేవారిని ఐసీయూల్లో చేర్చుకోవచ్చు.

-గుండె సమస్యలు లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో హెచ్చు తగ్గులు, శస్త్ర చికిత్స చేయించుకున్నవారిని కూడా ఐసీయూల్లో చేర్చుకోవడానికి కారణాలను తెలుసుకోవాలి.

-ఐసీయూ కోసం వెయిట్ చేస్తున్న రోగుల బీపీ, శ్వాస రేటు, గుండె పనితీరు, శ్వాస తీరు, ఆక్సిజన్ శాచ్యురేషన్, నాడీ వ్యవస్థ పనితీరు వంటి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఇది బెరడు కాదు, అమృతం.. షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం!!

Latest News

More Articles