Sunday, May 12, 2024

వెళ్లడానికి బస్సులు లేవని మద్యంమత్తులో 108కు ఫోన్

spot_img

ఆరోగ్యపరంగా ఎవరైనా ప్రమాదంలో ఉంటే అందరికీ గుర్తొచ్చేది 108. యాక్సిడెంట్ అయనా, ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే 108కి ఫోన్ చేస్తాం. ఆ 108 సిబ్బంది వచ్చి అపాయంలో ఉన్నవారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలిస్తారు. ఈ సౌకర్యం వల్ల చాలామంది రోగులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలుగుతున్నారు.

Read Also: నకిలీ పాస్‌పోర్టు స్కామ్‎లో మరో ముగ్గురు అరెస్ట్

అయితే ఈ 108 సదుపాయాన్ని ఓ వ్యక్తి ఎలా ఉపయోగించుకోవాలనుకున్నాడో తెలిస్తే అందరూ ముక్కున వేలేసుకుంటారు. బుధవారం రాత్రి రమేష్ అనే వ్యక్తి 108కి ఫోన్ చేశాడు. తాను చాలా నీరసంగా ఉన్నానని, ఎక్కడ పడిపోతానో తెలియదని 108కి ఫోన్ చేశాడు. వెంటనే ఆ సిబ్బంది రమేష్ లోకేషన్‎కి వచ్చారు. తీరా అతన్ని చూస్తే నడిచే స్థితిలోనే ఉన్నాడు, కానీ మద్యం మత్తులో ఉన్నాడు. అతన్ని 108కి ఎందుకు కాల్ చేశావ్ అని అడిగితే.. తాను హైదరాబాద్ నుంచి వస్తున్నానని, జనగాంకు వెళ్లాలని తెలిపాడు. తాను వెళ్లడానికి బస్సులు లేవని, అందుకే మీరు జనగాం వద్ద దించాలని చెప్పాడు. మీరు నన్ను దింపకపోతే ఎక్కడైనా స్పృహతప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు. దాంతో కంగుతిన్న 108 సిబ్బంది.. మీరు ఒప్పుకుంటే భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్తామని, ఈ 108 ఉన్నది ప్రాణాపాయంలో కాపాడటానికి అని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

More Articles