Saturday, June 22, 2024

జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ శ్రీకారం

spot_img

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూకశ్మీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే అధికారకంగా ప్రారంభించింది. రిజిస్టర్ లేని పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వాటిని స్వీకరించి ఆమోదించేందుకు ఈసీ నిర్ణయించినట్లు సెక్రటరీ జయదేబ్ లాహిరి ఇవాళ(శనివారం) ప్రకటించారు.

జమ్మూ కశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఫ్తీ మహ్మద్ సయీద్ సీఎం అయ్యారు. 2016లో ముఫ్తీ మహ్మద్ సయీద్ చనిపోయిన తర్వాత ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

2019 జూన్ 18న బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెహబూబా ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 2019 ఆగష్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.. తర్వాత ఆగస్టు 5, 2019న జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది..ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది, కశ్మీర్ లోయలోని లోక్‌సభ స్థానాల్లో 51.05 శాతం ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు చేర్యలు చేపట్టింది ఈసీ.

ఇది కూడా చదవండి:జూన్ 15వ తేది నుంచి కొత్త లోక్ స‌భ స‌మావేశాలు

Latest News

More Articles