Monday, May 20, 2024

రేపే విద్యాదినోత్సవం విజయోత్సవాలు..!

spot_img

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయం, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో విద్యాదినోత్సవం వేడుకలు జరుగనున్నాయి. గత తొమ్మిదేళ్లలో విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను తెలియజేయనున్నారు.

మన ఊరు – మనబడిలో భాగంగా పలు పాఠశాలలను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాటికి ప్రారంభోత్సవం చేయనున్నారు. దాంతో పాటు 10వేల గ్రంథాలయాలు, 1600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ను ప్రారంభించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మామిడితోరణాలు, పూలతో అందంగా అలంకరించి విజయోత్సవాలను ఘనంగా జరుపనున్నారు.

Latest News

More Articles