Friday, May 17, 2024

క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. వైరల్ వీడియో

spot_img

ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నోయిడాలో 35 ఏండ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన వికాస్‌ నేగి నోయిడాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే వీలు దొరికనప్పుడల్లా క్రికెట్ ఆడుతుంటాడు. తాజాగా ఆడుతున్న మ్యాచ్‌లో నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న ఆయన పరుగు కోసం వెళ్తూ పిచ్‌పైనే కుప్పకూలాడు. వెంటనే అతని మిత్రులు ప్రాథమిక చికిత్స చేసి దవాఖానకి తరలించారు. అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగా అతను మృతి చెంది ఉండవచ్చునని తెలిపారు. క్రికెట్‌ అంటే నేగీకి ఎంతో ఇష్టమని, తరచూ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడేవారమని, మ్యాచ్‌ ముందు వరకు అతనికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించలేదని మిత్రులు కన్నీరు పెట్టుకున్నారు.

Latest News

More Articles