Monday, May 13, 2024

ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ కన్నుమూత

spot_img

ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ(48) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీలో నొప్పి కారణంగా చెన్నై నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ నిన్న(శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన వడ చెన్నై, కాక్క కాక్క, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో సాంబ, ఘర్షణ, టక్‌ జగదీశ్‌తో పాటు పలు దక్షిణాది సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఎక్కువగా నెగెటివ్ రోల్స్ చేశారు.

టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్‌ ప్రారంభించిన డేనియల్‌.. ‘చిట్టి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, మలయాళంతో కలిపి దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Latest News

More Articles