Saturday, May 18, 2024

ఇంట్లోని మెంతులతో ఇలా చేస్తే.. ఒంట్లోని కొవ్వంతా మాయం

spot_img

బిజీ జీవితాలతో పాటు ఉద్యోగాల వల్ల సమయానికి తిండి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినడంతో ఒళ్లు గుళ్లవుతుంది. దాంతో శరీరంలో పలు మార్పులు వస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది అధిక బరువు. మొదట తినడం.. ఆ తర్వాత బరువు తగ్గడం కోసం నానా కష్టాలు పడుతుంటారు. కొంతమంది ఎక్సర్ సైజ్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఏం తినకుండా నోరు కట్టేసుకుంటుంటారు. అలాంటి వారందరు ఇంట్లో ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలని తెలుసుకోవాలి.

మన ఇంట్లో ఉండే మెంతులతో కూడా అధిక బరువును, కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. మెంతి గింజల్లో అనేక పోషక లక్షణాలు ఉండటంతో.. అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

మెంతులు తినలేని వారు మెంతి నీటిని తాగినా చాలా ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి వేళ నిద్రపోయే ముందు ఒక గ్లాసులో కొన్ని మెంతి గింజలు వేసి నాన బెట్టాలి. ఉదయాన్నే పరిగడుపున ఆ మెంతి నీటిని తాగితే సరిపోతుంది. ఇంకాస్త కొత్తగా కావాలంటే.. మెంతులను నీటిలో మరిగించి, తేనే, నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు. ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు మొత్తం మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Latest News

More Articles