Sunday, May 19, 2024

10 నిమిషాల వ్యవధిలో రెండు కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మృతి

spot_img

10 నిమిషాల వ్యవధిలో రెండు ఇండ్లలో కాల్పులు జరగడంతో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మృతిచెందిన విషాద ఘటన కెనడాలో జరిగింది. ఉత్తర ఒంటారియోలోని టాన్‌క్రెడ్ స్ట్రీట్‌లో ఉన్న రెండు ఇండ్లలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో పాటు మరో ఇద్దరు మరణించారు. మంగవారం రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి టాన్‌క్రెడ్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగాయని పోలీసులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. అది జరిగిన పది నిమిషాల తర్వాత ఆ ఇంటికి సమీపంలోని మరో నివాసంలో కాల్పులు జరిగినట్లు మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అప్పమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. మొదటి ఇంట్లో 41 ఏండ్లున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం రెండోసారి కాల్పులు జరిగిన ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ 6, 7, 12 వయస్సున్న ముగ్గురు పిల్లల మృతదేహాలను గుర్తించారు. వారికి సమీపంలోనే తనను తాను కాల్చుకుని చనిపోయిన మరో వ్యక్తి మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. రెండో ఇంటి దగ్గర జరిగిన ఘటనలో గాయపడిన 45 ఏండ్ల వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Read Also: వాషింగ్ మెషిన్లో నోట్ల కట్టలు, సెల్ ఫోన్లు.. షాకైన పోలీసులు

Latest News

More Articles