Sunday, May 19, 2024

పరిపాలన చేతకాక రేవంత్ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడు

spot_img

సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై సోయి లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ రేపు(ఆదివారం) నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ఉదయం 9గంటలకు బయలుదేరి భువనగిరి మీదుగా జనగామ వెళ్తారన్నారు. మొదట దేవరప్పులలో ఎండిన పంటలను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి, తుంగతుర్తి మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారన్నారు. ఆ తర్వాత సూర్యాపేట పట్టణంలోని జనగామ రోడ్‌లోని పంటలను పరిశీలిస్తారన్నారు.

సూర్యాపేటలో ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తారన్నారు. అక్కడి నుంచి హాలియా, మిర్యాలగూడ రోడ్ పక్కన ఉన్న సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి.. హైదరాబాద్‌కు బయలుదేరుతారన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కష్టాలు చూడలేక కేసీఆర్ ఆదివారం అన్నదాతల వద్దకు వస్తున్నారన్నారు. రేవంత్‌కి పరిపాలనపై సోయిలేదని.. ఇప్పటివరకు వ్యవసాయంపై సమీక్ష లేదని.. మంత్రి కూడా సమీక్ష చేయలేదరన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ ఉంటే భూమి ఆకాశo ఒక్కటి చేసైనా సరే అన్నదాతలకు నీళ్లు అందించేవారన్నారు.

ఇవాళ రాష్ట్రంలో దరిద్రమైన ప్రభుత్వం ఉన్నదన్నారు. రాష్ట్రంలో నీళ్లు అందక లక్షల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మొర పెట్టుకున్నా ప్రభుత్వంలో కదలిక లేదని ఆరోపించారు.నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదని.. ప్రభుత్వం నిర్లక్ష్యంతో అన్నదాతలు ఆగం అయ్యారన్నారన్నారు.కేసీఆర్‌పై కోపంతో రైతులను బలి పెట్టారు కాంగ్రెస్ వాళ్లు.. సాగర్‌లో డెడ్ స్టోరేజ్ నీళ్లు ఉన్నా అప్పుడు నీళ్లు అందించామన్నారు. అన్నదాతలను కాపాడుకున్నామని.. కానీ, ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఎస్సారెస్పీ కింద సూర్యాపేట జిల్లాలో నీళ్లు ఇస్తామన్నారు. పంటలు సాగు చేయండని చెప్పి మరి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

నీళ్లు ఇవ్వక ఎక్కడికక్కడ ఎండిపోయాయన్నారు. జిల్లా మంత్రులు అక్రమ వసూళ్లు, దందాలు మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. మిల్లర్లను బెదిరింపు చేసి కోట్లు వసూలు చేశారని.. మిల్లర్లు ఏమో అన్నదాతలను పీక్కోని తింటున్నరని విమర్శించారు. కోమటిరెడ్డి ఓ బడ్డారఖాన్.. ఓ జోకర్.. ఆయన మాటలకు ఎక్కడ విలువ లేదన్నారు. ఎంపీ లింగయ్య యాదవ్, రేవంత్ రెడ్డి సీఎం ఉండడం లేదన్నారు. దౌర్భాగ్యం జిల్లాలో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. కేసీఆర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారని, రైతుల అండగా ఉంటారన్నారు. పరిపాలన చేతకాక రేవంత్ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడన్నారు. ప్రజలు కాంగ్రెస్ నయవంచనను అర్థం చేసుకోవాలని కోరారు బీఆర్ఎస్ నాయకులు.

ఇది కూడా చదవండి: రైత‌న్న‌ల‌కు కేసీఆర్ భ‌రోసా..! రేపటి నుంచి ప‌ల్లె ప‌ల్లెకూ గులాబీ బాస్

Latest News

More Articles