Saturday, May 18, 2024

పీవీకి కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడం సంతోషకరం

spot_img

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటిండం సంతోషంగా ఉందన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌. దీనికి సబంధించి తన అధికారిక (X ) ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మెడీరి కృతజ్ఞతలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో గతంలో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించామని, అప్పటి నుంచే తాము పీవీకి భారతరత్న పురస్కారం ప్రటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని కేటీఆర్‌ గుర్తుచేశారు. అదేవిధంగా.. పీవీకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది జూన్‌లో పెట్టిన ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడం సంతోషంగా ఉంది: పీవీ కుమార్తె వాణీదేవి

పీవీ న‌ర‌సింహారావుకు కేంద్ర ప్ర‌భుత్వం భార‌త ర‌త్న ప్ర‌క‌టించ‌డం ప్ర‌శంస‌నీయ‌మన్నారు ఆయ‌న కుమార్తె వాణీదేవి. పీవీకి భార‌త‌ర‌త్న ఆల‌స్యంగా ప్ర‌క‌టించినా సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఆర్ధిక సంస్క‌ర‌ణ‌ల‌తో పీవీ న‌ర‌సింహారావు దేశాన్ని ముందుకు న‌డిపించార‌ని కొనియాడారు. గొప్ప వ్య‌క్తుల‌కు స‌న్మానం మ‌న సంస్కార‌మ‌ని అన్నారు. పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించినందుకు ఆమె కేంద్రానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పీవీ

Latest News

More Articles