Sunday, May 19, 2024

ఐదేండ్లు రేవంత్ రెడ్డినే పరిపాలించి, హామీలు అమలు చేయాలి

spot_img

కాంగ్రెస్ పార్టీలోనే ఏక్‌నాథ్ షిండేలు ఉన్నార‌ని.. నీ ప‌క్క‌నే ఉన్న ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ బాంబుల‌తోనే నీకు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. బీఆర్ఎస్ పార్టీతో రేవంత్‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని, ఈ ఐదేండ్లు ఆయ‌నే పాలించి, హామీలు చేయాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. న‌ల్ల‌గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి వంద రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ రుణ‌మాఫీ చేయ‌లేదు. రైతుబంధు ఇవ్వ‌లేదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై గ్రామాల్లో రైతులు కుత‌కుత ఉడుకుతున్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అంట‌డు. చెప్పుతో కొట్ట‌మ‌న్న ఆయ‌న అహ‌కంరానికి ఓటు అనే ఆయుధంతో వేటు వేయండి. రైతుబంధు దుబారా అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అంటుండు. న‌ల్ల‌గొండ జిల్లా రైత‌న్నల‌కు విజ్ఞ‌ప్తి. అహంకారంగా మాట్లాడే ఈ జిల్లా నాయ‌కుల‌కు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ధి చెప్పాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ కావాలంటే, రూ. 15 వేల రైతుబంధు ఇవ్వాలంటే, వ‌రి ధాన్యానికి బోన‌స్ రూ. 500 ఇవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. తాము ఏవీ అమ‌లు చేయ‌కున్నా.. మ‌ళ్లీ మాకే ఓటేశార‌ని త‌ప్పించుకు తిరుగుతారు. సీఎం రేవంత్ జేబులో క‌త్తెర పెట్టుకుని తిరుగుతున్నా అంటుండు. త‌న‌కు తెలిసి జేబు దొంగ‌లు తిరుగుతారు ముఖ్య‌మంత్రులు తిరుగరు అని కేటీఆర్ తెలిపారు. పేగులు క‌ట్ చేసి మెడ‌లో వేసుకుంటా అంటుండు. అది ముఖ్య‌మంత్రి చేసే ప‌నా.. అది బోటి కొట్టేడు చేసే ప‌ని. సెక్ర‌టేరియ‌ట్‌లో లంకె బిందెలు ఉన్నాయ‌కున్నా.. ఇక్క‌డ ఖాలీ బిందెలు ఉన్నాయి. అయినా లంకె బిందెల కోసం ఎవ‌రు తిరుగుతారు..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

నీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌నే ఆలోచ‌న మాకు లేదు.. డేంజ‌ర్ బీఆర్ఎస్ నాయ‌కుల‌తో లేదు. మీకు ప్ర‌మాద‌మంతా న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం బాంబుల‌తోనే ఉంది. ఏక్‌నాథ్ షిండేలు మీ పార్టీలో ఉన్నార‌ని బీజేపోళ్లు చెబుతున్నారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వెళ్లి నితిన్ గ‌డ్క‌రీ దగ్గర  నేనొస్తా నేనొస్తా అని అంటున్నార‌ట‌. నీ ప‌క్క‌న ఉన్నారు డేంజ‌ర్ గాళ్లు. రేవంత్ రెడ్డి మీరు ఐదేండ్లు సీఎంగా ఉండాలి. కానీ 420 హామీలు అమ‌లు చేయాలి. అవి అమ‌లు చేయ‌క‌పోతే వ‌ద‌లిపెట్టం. రుణ‌మాఫీ చేయ్. 18 ఏండ్లు నిండిన ప్ర‌తి ఆడ‌బిడ్డ‌కు నెల‌కు రూ. 2500 ఇస్తాన‌ని చెప్పావు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తా అన్నావు. దాని కోసం రైతలు ఎదురుచూస్తున్నారు. ఆటో డ్రైవ‌ర్లు రోడ్ల మీద ప‌డి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి ఉంది. ఆటో డ్రైవ‌ర్ల‌కు నెల‌కు రూ. 10 వేలు ఇచ్చి ఆదుకోవాలి. ద‌మ్ముంటే ఈ ప‌నులు చేసి చూపించు అని కేటీఆర్ స‌వాల్ చేశారు.

పొంక‌నాల పోతిరెడ్డి మాట‌లు విని ప్ర‌జ‌లు మోస‌పోయారు. నిజం నిల‌క‌డ మీద‌నే తెలుస్తుంది. ఇదే తెలంగాణ ప్ర‌జ‌లు ప్రేమ‌తో, ద‌య‌తో ప‌దేండ్లు బీఆర్ఎస్‌కు అవ‌కాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పాల‌న స్వ‌ర్ణ‌యుగాన్ని త‌ల‌పించింది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టే.. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ దాకా మాట్లాడారు. ఇవాళ రాహుల్ మాట్లాడుతూ.. మోడీ దొంగ అంట‌డు. రేవంత రెడ్డేమో మోడీ మా పెద్ద‌న్న అని అంటుండు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే.. అదానీ మా ఫ్రెండ్ అని రేవంత్ అంటుండు. లిక్క‌ర్ స్కాం లేదు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయ‌డం అన్యాయం అని రాహుల్ అంటుండు. లిక్క‌ర్ స్కాం నిజ‌మే. క‌విత అరెస్టు క‌రెక్ట్ అని రేవంత్ అంటుండు. గుజ‌రాత్ ఓ ఫేక్‌ మోడ‌ల్ అని రాహుల్ అంటడు. తెలంగాణ‌ను గుజ‌రాత్ మోడ‌ల్‌లా చేస్తా అని రేవంత్ అంటున్నాడు. రేవంత్ రాహుల్ కోస‌మా, మోడీ కోస‌మా ప‌ని చేసేది. ఒక్క ఓటు కాంగ్రెస్‌కు వేసినా అది బీజేపీకి పోతుంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్.. షెల్ట‌ర్, భ‌విష్య‌త్, కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం బీజేపీలో చేరుతారు. ఈ మాట ప‌దిసార్లు అన్నాను. కానీ ఈ విష‌యంలో మాత్రం రేవంత్ స్పందించ‌డం లేద‌న్నారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహి పార్టి

Latest News

More Articles