Sunday, May 19, 2024

ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ గెలుపుకోసం కలసికట్టుగా కృషి చేద్దాం

spot_img

ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ గెలుపుకోసం కలసికట్టుగా కృషి చేద్దాం..నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా ఇద్దామన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ ప్రకటించారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందన్నారు. వంద రోజుల కాంగ్రెస్ అసమర్ద పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దామని తెలిపారు. రుణమాఫీ అటకెక్కింది .. రైతుభరోసా ఆగిపోయింది. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 భృతి  పథకాల ఊసెత్తడం లేదు.కేసీఆర్ ప్రభుత్వం భర్తీచేసిన 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సాగునీళ్లు ఆగిపోయాయి.. తాగునీళ్లకు కరువొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదన్నారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతోందని తెలిపారు. మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని ప్రకటనలో తెలిపారు నిరంజన్ రెడ్డి.

పదేళ్లలో పచ్చబడ్డ పాలమూరు మళ్లీ భీడు భూములతో దర్శనమిస్తోందన్నారు. కరంటు కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారన్నారు. అర్దరాత్రి కరంటు కోసం రైతులు నిద్ర కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ మళ్లీ తీసుకొచ్చిందన్నారు.కాంగ్రెస్ తెచ్చిన ఈ మార్పులను గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు.  బీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలం .. నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా ఇద్దామని ప్రకటనలో తెలిపారు నిరంజన్ రెడ్డి.

ఇది కూడా చదవండి: ఓ హోటల్‌లో భారీ పేలుడు..తమ పనే అన్న ఉగ్రవాద సంస్థ.!

Latest News

More Articles