Friday, May 3, 2024

పాక్‌ మాజీ ప్రధాని జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

spot_img

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. రహస్య పత్రాల లీకేజీకి సంబంధించిన కేసులో సెప్టెంబర్‌ 13 వరకు కస్టడీని పొడిగించింది. తోషాఖానా కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ విడుదలకు ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించినా జైలులోనే ఉండనున్నారు.

అట్టాక్‌ జైలులో రహస్య పత్రాల లీకేజీ కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 5 నుంచి పంజాబ్‌ అట్టాక్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

Latest News

More Articles