Sunday, May 12, 2024

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్‌

spot_img

పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను పాక్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ ఖాన్ ను ఇవాళ(మంగళవారం) అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్టులో హాజరుపర్చిన  తర్వాత ఇమ్రాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆయన్ను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం.. దీంతో పాటు కోర్టులో ఆయనకు ఉపశమనం లభించడంతో ఇంతకాలం ఇమ్రాన్‌ ఖాన్ అరెస్టు చేయలేదు. ఇమ్రాన్‌ఖాన్‌ ను అరెస్ట్‌ చేస్తున్న సమయంలో కోర్టు దగ్గర గొడవలు జరిగాయి. ఈ గొడవలో ఇమ్రాన్‌ లాయర్‌ కు తీవ్రగాయాలయ్యాయి. అల్లర్లు జరుగుతుండటంతో ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles