Tuesday, May 21, 2024

భారత మార్కెట్‌పై ఎఫ్‌పీఐలు ఆసక్తి!

spot_img

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో సవాళ్లు నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ బలం పెరిగింది. భారత ఈక్విటీ మార్కెట్లలోకి 2023లో రూ.1.7 లక్షల కోట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPIs) రావడం దీనికి నిదర్శనం. ఒక్క డిసెంబర్‌లోనే రూ.66,134 కోట్ల ఎఫ్‌పీఐలు వచ్చాయి. రానున్న రోజుల్లో FPIల ప్రవాహం మరింత బలంగా ఉండొచ్చని స్మాల్‌కేస్ మేనేజర్‌, ఫిడెల్ ఫోలియో వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ్ అంచనా వేశారు. 2024లో అమెరికాలో వడ్డీరేట్లు క్రమంగా తగ్గే అవకాశం ఉందని, భారత మార్కెట్‌పై ఎఫ్‌పీఐ (FPIs)లు ఆసక్తి చూపొచ్చని తెలిపారు.

Latest News

More Articles